Namaste NRI

డొనాల్ట్‌ ట్రంప్ సంచలన నిర్ణయం…అమెరికాలో!

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్నును రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఐటీ రద్దు చేస్తే అది వ్యక్తులకు, కుటుంబాలకు ఖర్చు చేయగల ఆదాయాన్ని పెంచుతుందని ఆయన భావిస్తున్నారు. ఇది పాత అమెరికన్‌ పద్ధతులను తిరిగి తేవడమే కాక, దేశ సంపద పెరుగుతుందని, అమెరికా ను సుసంపన్న దేశంగా చేస్తుందని, మునుపెన్నడూ లేనంతా పటిష్ఠవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదాయపు పన్ను రద్దు ద్వారా వచ్చే లోటును దిగుమతుల సుంకాల ద్వారా భర్తీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. మరోవైపు భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాలపై అత్యధిక పన్నులు విధిస్తామని ట్రంప్‌ చెప్పారు. ఆ దేశాలను అత్యధిక సుంకాలు విధించే దేశాలుగా పేర్కొన్న ఆయన, అమెరికాకు హాని కలిగించే దేశాలపై సుంకాలను తప్పక విధిస్తామని చెప్పారు.

Social Share Spread Message

Latest News