Namaste NRI

డొనాల్డ్ ట్రంప్‌ సంచలన ప్రకటన… కెనడాతో

కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్‌ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ డిజిటల్‌ సర్వీస్‌ ట్యాక్స్‌పై కెనడా వెనక్కి తగ్గకపోవడంతో ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.

కెనడలో డిజిటల్‌ సేవల పన్ను గతేడాది అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కంపెనీలు మాత్రం ఈ ఏడాది జూన్‌ 30 నుంచి పన్ను చెల్లింపులు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. కెనడాలో ఆన్‌లైన్‌ ద్వారా గణనీయమైన ఆదాయం అర్జించే పెద్ద డిజిటల్‌ కంపెనీలు తమ ఆదాయంపై 3 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ సేవలు, ఆన్‌లైన్ ప్రకటనలు, సోషల్ మీడియా సేవలు, వినియోగదారుల డేటా అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఈ పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ విధానం యూఎస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన పెద్ద పెద్ద టెక్‌ కంపెనీలు, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీంతో అధ్యక్షుడు దీనిపై ప్రధానంగా దృష్టి సాధించారు. జూన్ 30 నుంచి ఈ కొత్త పన్నుల విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Social Share Spread Message

Latest News