
జనవరిలో ప్రమాణస్వీకారం చేయనున్న అమెరికా కాబోయి అధ్యక్షుడు ట్రంప్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పన్నుల అంశంలో భారత విధానాన్ని తప్పుపట్టారు. అమెరికా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాన్ని భారత్ వసూల్ చేస్తున్నదని, దానికి ప్రతీకారంగా మేం కూడా ట్యాక్స్‌ను వసూల్ చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఒకవేళ భారత్ పన్ను వసూల్ చేస్తే, వాళ్లకు కూడా మేం ట్యాక్స్ వేస్తామని, ఇది ప్రతిచర్యగా ఉంటుందని, దాదాపు అన్ని అంశాల్లో భారత్ అధిక దిగుమతి సుంకాన్ని వసూల్ చేస్తున్నదని, కానీ తామేమీ ట్యాక్స్ వసూల్ చేయడం లేదని ట్రంప్ తెలిపారు. ఇండియాతో పాటు బ్రెజిల్ కూడా తమ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాన్ని వసూల్ చేస్తున్నట్లు ట్రంప్ ఆరోపించారు.
