అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల పర్వం కొనసాగుతున్నది. పన్నులు తగ్గించాలని ఇటీవల భారత్‌ను హెచ్చరించిన ఆయన ఈసారి యూరోపియన్ యూనియన్‌పై విరుచుకుపడ్డారు. అమెరికా-యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య లోటును తగ్గించకపోతే, పన్నుల కొరడా ఝళిపిస్తానని హెచ్చరించారు. చమురు, సహజ వాయువు అత్యధికంగా అమెరికా వద్ద కొనాలని చెప్పారు. ఈ విషయాన్ని తాను యూరోపియన్ యూనియన్‌కు తెలియజేశానని ట్రంప్ వెల్లడించారు. 2016-2020 మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ట్రంప్ ఇదే వైఖరిని అవలంబించారు. యూరోప్ చాలా కాలం నుంచి అమెరికా వీపుపై గుర్రపు స్వారీ చేస్తున్నదన్నారు. అలా జరగడానికి అవకాశం ఇచ్చినది అమెరికాయేనని చెప్పారు.