సువిక్షిత్, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం దూరదర్శని. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు బి.సాయిప్రతాప్‌రెడ్డి, జయశంకర్ రెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి అపన్నా తనామనా అనే లిరికల్ వీడియోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హీరో సువిక్షిత్ గొప్ప పాషన్‌తో నటించారని మెచ్చుకున్నారు. 1990 నేపథ్యంలో జరిగే ప్రేమకథ ఇదని, ప్రతి ఒక్కరిని ఆ కాలంలోకి తీసుకెళ్తుందని, బ్యాక్‌డ్రాప్‌కు తగిన లొకేషన్లలో సహజంగా తెరకెక్కించామని, తన అభిమాన దర్శకుడు సుకుమార్ ఈ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందని హీరో సువిక్షిత్ అన్నారు. సువిక్షిత్ బొజ్జ, గీతిర రతన్, భద్రం, కృష్ణా రెడ్డి, కిట్టయ్య, చలపతి రాజు, జెమిని సురేష్, జి.భాస్కర్, భద్రమ్, లావణ్య రెడ్డి, తేజ చిట్టూరు తదితరులు నటిస్తు న్నారు. ఈ చిత్రానికి కథ: నారాయాణ ఆవుల, డైలాగ్స్: కాకర్ల చరణ్, లక్ష్మణ్.కె, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె.సుబ్బారెడ్డి, సంగీతం: ఆనంద్ గుర్రాన.
