సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మసూద. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. హారర్ డ్రామా కథతో దర్శకుడు సాయి కిరణ్ రూపొందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ నిర్మాత రాహుల్ యాదవ్ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తారు. ఈ సినిమా టీజర్ కొత్తగా ఉండి ఆకట్టుకుంది. మా ఎస్వీసీ సంస్థ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ మంచి సినిమా చేశామనే అనుకుంటున్నాను. హారర్ డ్రామా కథతో ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ సినిమాను ఈ నెల 18న నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్, ఛాయాగ్రాహకుడు నగేష్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)