Namaste NRI

సామాన్యులే సెలబ్రిటీలుగా డ్రింకర్ సాయి సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్న చిత్రం డ్రింకర్‌ సాయి.  బ్రాండ్‌ ఆఫ్‌ బ్యాడ్‌ బాయ్స్‌ అనేది ఉపశీర్షిక. కిరణ్‌ తిరుమలశెట్టి దర్శకుడు. బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌ నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

సామాన్యులైన ఆటోడ్రైవర్‌, ఎలక్ట్రీషియన్‌, ఏసీ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, వెయిటర్‌, కూలీలను సెలబ్రిటీలు గా భావించి, వారి చేతుల మీదుగా ఈ సినిమా టీజర్‌ని లాంచ్‌ చేశారు. ప్రేక్షకుల్ని కదిలించే సినిమా డ్రింకర్‌ సాయి అనీ, అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న ప్రాపర్‌ మూవీ ఇదని నిర్మాతలు చెప్పారు.  మా సినిమాలో హీరో ఆపకుండా తాగుతుంటాడు. అందుకే డ్రింకర్‌ సాయి అని పేరు పెట్టాం. టీజర్‌లో ఇబ్బందికరంగా కొన్ని మాటలు ఉండొచ్చు. కానీ అవి రియల్‌ లైఫ్‌లో మాట్లాడుకునే మాటలే. సినిమా చూశాక ఆ నెగెటివ్‌ ఇంప్రెషన్‌ పోయి, మంచి సినిమా తీశాడని దర్శకుడిగా నన్ను అభినందిస్తారు అని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రబృందం మొత్తం మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events