Namaste NRI

దుల్కర్‌ సల్మాన్‌- పూజాహెగ్డే జోడీ.. సెట్స్‌లో సందడి

దుల్కర్‌ సల్మాన్‌, పూజాహెగ్డే   జోడీగా తెలుగులో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నది. దుల్కర్‌ సల్మాన్‌ 41వ చిత్రం (డీక్యూ41 వర్కింగ్‌ టైటిల్‌) ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. రవి నేలకుడిటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. హ్యూమన్‌ డ్రామాతో కూడిన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతున్నది. ఈ సినిమాలో పూజాహెగ్డేను కథానాయికగా ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆన్‌లోకేషన్‌ తాలూకు స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. ఇందులో పూజాహెగ్డే, దుల్కర్‌ సల్మాన్‌ స్కూటీపై షికారు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, రచన-దర్శకత్వం: రవి నేలకుడిటి.

Social Share Spread Message

Latest News