Namaste NRI

దుల్కర్‌ సల్మాన్‌ సీతారామం సెన్సార్‌ పూర్తి

టాలీవుడ్‌ నుంచి రాబోతున్న తాజా ఇంట్రెస్టింగ్‌ చిత్రాల్లో దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ నటించిన చిత్రం సీతారామం. ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్‌ జరుపుకుంటూనే మరోవైపు సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్టుగా మేకర్స్‌ తెలిపారు. దర్శకుడు హను రాఘవపూడి ఈ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీకి సెన్సార్‌ క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ను అందించారు. దీంతో అయితే థియేటర్స్‌లో ఒక క్లీన్‌ ఎంటర్‌టైన్‌ చూడటం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. ఇప్పటికే సీతారామం మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సీతారామం చిత్రాన్ని తమిళంలో థియేట్రికల్‌ రిలీజ్‌ చేసేందుకు గాను రైట్స్‌ను దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం లోనూ ఒకేసారి సీతారామం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ సమర్పణలో స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ  సినమా ఆగస్ట్‌ 5న విడుదల కాబోతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events