మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న తాజా చిత్రం సీతారామమ్. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కన్నడ భామ రష్మిక మందన్నా కీ రోల్ చేస్తోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. వార్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్న సీతారామమ్‌లో దుల్కర్ సల్మాన్ రామ్ అనే జవాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రషెస్‌కు మంచి స్పందన వస్తోంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్‌లో వచ్చిన ఓ సీత హే రామ సాంగ్ సూపర్ హిట్టయింది. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. సుమంత్, గౌతమ్‌మేనన్, ప్రకాష్ రాజ్, తరుణ్‌భాస్కర్, శత్రు, భూమిక చావ్లా, రుక్మిణి విజయ్ కుమార్, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
