Namaste NRI

ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యం లో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యం లో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి గారు తెలియజేసారు. విదేశాల్లో వున్నా మన సంస్కృతి సంప్రదాయాలకు విలువనిచ్చి మన తెలుగు వాళ్ళు అక్కడ ఎంతో ఆనందంగా ఈ పండుగలని జరుపుకున్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా ఈ పండుగ వేడుకలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు సంవత్సరాలు పాటు కరోనా మహమ్మారితో ఇబ్బంది పడిన జనాలకి ఈ కార్యక్రమం మంచి మానసిక ఉల్లాసాన్నిచ్చింది.

దసరా పాటలతో, నృత్యాలతో కూడుకున్న ఈ కార్యక్రమం దాదాపు ఏడు గంటల పాటు నిరంతరాయంగా జరిగేలా కృషి చేశారు ఈ సంస్థ నిర్వాహకులు అయినటువంటి సింగపురం వినయ్ , అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి.

తెలంగాణ లో ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి ఈ బతుకమ్మ పండుగ సందర్బంగా వివిధ రకాల పూల అలంకరణతో బతుకమ్మని తయారు చేయించి, పిల్లలు, ఆడపంచులందరు పాల్గొని బతుకమ్మ కోలాటం ఆడించేందుకు బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ ఎంతో కృషి చేశారు.

మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని, ఫిన్లాండ్ లో వున్న మన తెలుగు వాళ్లకి అండ దండలగా ఉంటామని తెలియ జేశారు సంస్థ ఉపాధ్యక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి గారు, జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి గారు, సత్యనారాయణ గారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events