Namaste NRI

ప్రగతి భవన్‌లో ఘనంగా దసరా వేడుకలు

విజయ దశమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు. సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయుధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్బంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి శోభమ్మ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events