నాజర్, అంజలి, అనిత ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ముసలోడికి దసరా పండగ. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ని నాజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్రని తీర్చిదిద్దిన విధానం కొత్తగా ఉంటుంది. ఇది తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా స్వచ్ఛమైన వినోదంతో రూపొందిన చిత్రమిది. త్వరలో సినిమా రిలీజ్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి నాకు పితృ సమానులైన దర్శకులు ఈవీవీ సత్యనారాయణకి అంకితం ఇస్తున్నా అన్నారు. కోవై సరళ, శరణ్య, సత్య తదితరులు నటిస్తున్నారు. డి.మనోహర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రమణ ఫిలింస్ పతాకంపై రమణ వాళ్లె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: డి.ఇమాన్.
