దేశంలోని యూజర్లందరికీ ఇకపై వాట్సాప్ పేమెంట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ పేను తన యూపీఐ యూజర్లందరికీ విస్తరించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అనుమతిం చింది. యూపీఐ యూజర్ల చేరికపై ఉన్న పరిమితిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. గతంలో వాట్సాప్ పే తన యూపీఐ యూజర్ బేస్‌ను దశలవారీగా విస్తరించడానికి ఎన్‌పీసీఐ అనుమతి ఇచ్చింది. 10 కోట్ల మంది యూజర్లకు మాత్రమే గతంలో అనుమతి ఉంది. ఈ గరిష్ఠ పరిమితిని ఇప్పుడు తొలగించినట్టు ఎన్‌పీసీఐ పేర్కొంది. భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వ్యవస్థను ఎన్‌పీసీఐ నిర్వహిస్తుంది.