సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం అహం రీబూట్. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి శరణ్ కొప్పిశెట్టి క్లాప్‌నివ్వగా, చందూ మొండేటి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది. ఇందులో సుమంత్ ఆర్జేగా కనిపిస్తారు అన్నారు. అహం అంటే నేను.. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్.. అహం అంటే పొగరు, ద్వేషం అని కాకుండా నేను అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం అన్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి స్వరాలందిస్తున్నారు. వరుణ్ అంకర్ల ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అల్లూరి తెరకెక్కిస్తున్నారు. రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.














