ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆపిల్ స్టోర్ నుంచి ట్విట్టర్‌ను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ట్విట్టర్‌ను బ్లాక్ చేసేందుకు ఆపిల్ అన్ని విధాలుగా ఒత్తిడి చేస్తోందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఐఫోన్ తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌ల్లో ప్రకటనలను నిలిపివేసిందని తెలిపారు. కంటెంట్ మోడరేషన్ పేరుతో అపిల్ ట్విట్టర్‌పై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.