రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ చాలెంజ్ విసిరారు. నువ్వూ, నేనూ పరస్పరం పోరాడుకుందాం ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌పై ఎడతెగని దాడులు కొనసాగిస్తూ విధ్వంసం, మారణ హోమానికి కారణమవుతున్న తీరుపై మండిపడ్డారు. దమ్ముంటే ఒకరినొకరం ప్రత్యక్షంగా తేల్చుకుందా రా అంటూ సవాల్ చేశారు. నేను వ్లాదిమిర్ పుతిన్‌కు ఒంటరి పోరాటానికి సవాల్ చేస్తున్నాను. గెలిచిన వారు ఉక్రెయిన్‌లో వాటా పొందుతారు అంటూ ట్వీట్ చేశారు. రష్యా అధ్యక్ష భవనపు ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేశారు. పుతిన్‌కు ట్విట్టర్ ఖాతా లేనుందున క్రెమ్లిన్ అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేసి మరీ వెంటనే స్పందించాలంటూ ఠారెత్తించారు. ఈ ట్వీట్ చేసిన గంట తర్వాత మరొక ట్వీట్ చేశారు. ఈ ఛాలెంజన్‌ను మీరు స్వీకరిస్తున్నారా? అంటూ క్రెమ్లింగ్‌ను ప్రశ్నించారు.














