సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చారు. ట్విట్టర్ పక్షి లోగోను మార్చనున్నట్టు వెల్లడించారు. దీంతోపాటు ట్విట్టర్‌ను రీబ్రాండ్ చేయనున్నట్టు ప్రకటించారు. చైనాకు చెందిన వియ్‌చాట్ తరహాలో ఎవ్రీథింగ్ ఎక్స్ యాప్‌ను రూపొందించాలని ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. కేవలం సామాజిక మాధ్యమంగానే కాకుండా పేమెంట్ సర్వీసెస్, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ వంటి అని రకాల సేవలు అందించేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దనున్నారు. అందులో భాగంగానే ట్విట్టర్‌ను అతిత్వరలో ఎక్స్ యాప్‌గా రీబ్రాండ్ చేయనున్నట్టు సమాచారం. త్వరలోనే మేం ట్విట్టర్ బ్రాండ్‌కు తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలుకనున్నాం అని మస్క్‌ప్రకటించారు.