ట్విట్టర్‌ను చేజిక్కించుకున్నప్పటి నుంచి తనదైన మార్పులు చేస్తున్న ఎలాన్ మస్క్ మరో ముందగుడు వేయబోతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చారు. ఇప్పుడు ఆ యాప్‌ను అన్నింటికి ఒకే వేదికగా చేయాలని అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా, ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకొనే సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించారు. తాజాగా ఎక్స్ కోసం అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రభుత్వం నుంచి మనీ ట్రాన్స్‌మిటర్ లైసెన్స్ కూడా పొందారు. అంటే ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకొనేందుకు ఎక్స్‌కు అనుమతి లభించిందన్న మాట. అయితే, ఈ సదుపాయం యూజర్లకు 2024 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.