Namaste NRI

ఎలాన్ మస్క్ మరో సంచలనం..ఇకపై ఫోన్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్

ఎలాన్‌ మస్క్‌ మొబైల్ ఫోన్‌కు గుడ్‌బై చెప్పారు. ఇకపై కొన్ని నెలలపాటు తాను మొబైల్‌ను వినియోగించనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌.కామ్‌ లో ఆయన ఒక పోస్ట్‌ చేశారు. ఇకపై ఆడియో, వీడియో కాల్స్‌ కోసం ఎక్స్‌.కామ్‌నే వినియోగించనున్నట్లు తెలిపారు. నేను కొన్ని నెలల పాటు మొబైల్‌ ఫోన్‌ను వినియోగించ డం మానేస్తున్నా. ఆడియో, వీడియో కాల్స్‌ కోసం మొబైల్‌ ఫోన్‌కు బదులుగా ఎక్స్‌.కామ్‌ను ఉపయోగిస్తున్నా అని మస్క్‌ ఎక్స్‌.కామ్‌ను లో పేర్కొన్నారు.

 మస్క్‌ ఎక్స్‌.కామ్‌ను ఎవ్రిథింగ్‌ యాప్‌గా మారుస్తామని ప్రకటించారు. అందులో భాగంగా దానిలో ట్వీట్‌లు మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్‌ మాట్లాడుకునేందుకు గత ఏడాది అక్టోబర్‌లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు.ఈ క్రమంలో మస్క్‌ ఎక్స్‌.కామ్‌ను ప్రమోట్‌ చేసేందుకే ఫోన్‌ను దూరం పెడుతున్నా రని వార్తలు వినిపిస్తున్నాయి. 2023లో ఎక్స్‌.కామ్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఎర్లీ వెర్షన్‌ ఆఫ్‌ వీడియో అండ్‌ ఆడియో కాలింగ్‌ ఆన్‌ ఎక్స్‌ ఫీచర్‌ను ప్రారంభించారు. ఎక్స్‌.కామ్‌ యూజర్లందరికి కాల్స్‌ చేసుకునే సదుపాయం లేదు. కేవలం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న యూజర్లకు మాత్రమే వీడియో, ఆడియో కాలింగ్‌ ఫీచర్‌ వర్తిస్తుంది.

Social Share Spread Message

Latest News