టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన బ్రెయిన్ చిప్ ఇంటర్ఫేస్ స్టార్టప్ అభివృద్ధి చేసిన వైర్లెస్ పరికరాన్ని ఆరు నెలల్లో మనిషి మెదడులో అమర్చనున్నట్లు ప్రకటించారు. కాలిఫోర్నియాలోని న్యూరాలింక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మస్క్ బ్రెయిన్ `కంప్యూటర్ ఇంటర్ఫేస్ (బీసీఐ) సాంకేతికత వివరాలను తెలిపారు. ఈ టెక్నాలజీని మరో ఆరు నెలల్లో మనిషిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీని కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు సమర్పించే పత్రాలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడిరచారు. ఇప్పటి వరకు ఎఫ్‌డీఏతో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని వివరించారు. ఈ సందర్భంగా మనిషి మెదడులో ప్రవేశపెట్టబోయే చిప్‌తో పాటు దాన్ని అమర్చే రోబోను కూడా పరిచయం చేశారు.