చాట్‌జీపీటీ రూపకర్త సంస్థ ఓపెన్ ఏఐపైనా, దాని సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పైనా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ దావా వేశారు. మానవాళి ప్రయోజనాల కోసం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను అభివృద్ధి చేయ డం ఆ కంపెనీ అసలు లక్ష్యమని, అయితే దాన్ని ఆ కంపెనీ వదిలి పెట్టిందని మస్క్ ఆరోపించారు. లాభా పేక్ష లేని విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా కృత్రిమ మేధను రూపొందించేందుకు తనను ఆల్ట్‌మన్, ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రోక్‌మన్ మొదట్లో సంప్రదించారని దాఖలు చేసిన ఈ దావా లో మస్క్ వెల్లడించారు. అయితే ఈ కంపెనీ ఆ కాంట్రాక్టును ఉల్లంఘించిందని ఆరోపించారు. జీపీటీ-4 డిజైన్ ను పూర్తి రహస్యంగా ఉంచిందన్నారు. 2015లో ఓపెన్‌ఏఐ వ్యవస్థాపకుల్లో మస్క్ ఒకరు. ఆయన 2018లో దీని బోర్డు నుంచి వైదొలగారు.