Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ కు ఎలాన్ మస్క్ బిగ్ షాక్

డొనాల్డ్ ట్రంప్  ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తితో రగిలిపోతున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో  ఎలాన్‌ మస్క్‌ డోజ్‌ నుంచి తప్పుకున్నారు. ట్రంప్‌ పాలకవర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్‌ ఉద్యోగిగా తన షెడ్యూల్‌ ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు. డోజ్‌ మిషన్‌ భవిష్యత్తులో మరింత బలపడుతుంది  వెల్లడించాడు.

గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపులో ఎలాన్‌ మస్క్‌ ప్రముఖ పాత్ర పోషించారు. భారీగా నిధులు సమకూర్చడంతోపాటు ప్రచార బాధ్యతలు కూడా పర్యవేక్షించారు. ఇందుకుగాను ట్రంప్‌ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మస్క్‌కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి ఉద్దేశించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజ్‌) శాఖ బాధ్యతలను ఆయన చేతికిచ్చారు.

Social Share Spread Message

Latest News