Namaste NRI

ఎల‌న్ మ‌స్క్‌కు అభిమానులు.. సర్‌ప్రైజ్‌

ట్విట్ట‌ర్‌ని కొనుగోలు చేసిన ఎల‌న్ మ‌స్క్‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే బ‌హుమ‌తి ఇవ్వ‌బోతున్నారు అభిమానులు. పది ల‌క్ష‌ల అమెరిక‌న్ డాల‌ర్లు (రూ..4.8 కోట్లు) ఖ‌ర్చు పెట్టి మ‌స్క్ విగ్ర‌హం త‌యారుచేయించారు. ఈ విగ్ర‌హం ధ‌ర మాత్ర‌మే కాదు రూపం కూడా ఆశ్చ‌ర్య‌పోయేలా ఉంటుంది. మ‌స్క్ త‌ల‌, మేక శ‌రీరంతో ఉన్న ఎల‌న్ మ‌స్క్ రాకెట్ నడుపుతున్న‌ట్టుగా ఈ విగ్ర‌హాన్నిత‌యారుచేయించారు. మెడ‌లో మెరుపు గుర్తు ఉన్న 24 క్యారెట్ల బంగారంప్లేట్‌ని వేలాడ‌దీశారు. 30 అడుగుల పొడవు, ఐదు అడుగుల తొమ్మిది ఇంచుల ఎత్తు ఉన్న‌ విగ్ర‌హం త‌యారీకి అల్యూమినియం ఉప‌యోగించారు.

 కెన‌డాకు చెందిన కెవిన్‌, మిచెల్లె స్టోన్ అనే శిల్పకారులు ఈ విగ్ర‌హాన్ని రూపొందించారు. ఎలన్ గోట్ టోకెన్ (ఏఈజీ) అనే క్రిప్టో క‌రెన్సీ కంపెనీ ఈ స్టాచ్యూని త‌యారుచేయించింది.‘చాలామంది మీరు ఇంత పెద్ద విగ్ర‌హాన్ని త‌యారుచేయ‌లేమ‌ని అనుక‌న్నారు. కానీ, ఒక్క ఏడాదిలో మేము ఈ విగ్ర‌హాన్ని చేశాం. దీన్ని ఇప్పుడు ఎల‌న్ మ‌స్క్‌కి అంద‌జేసే స‌మ‌యం వ‌చ్చింది. ఈ ప్రపంచంలోనే ఇన్నోవేటివ్‌గా ఆలోచించ‌గ‌ల బ‌తికి ఉన్న ఏకైక వ్య‌క్తి మ‌స్క్‌  ఈ విగ్ర‌హాన్నిన‌వంబ‌ర్ 26న టెక్సాస్‌లోని టెస్లా కార్యాల‌యంలో ఎల‌న్ మ‌స్క్‌కి అంద‌జేస్తామ‌ని ఏఈజీ సంస్థ చెప్పింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events