స్మార్ట్ టీవీల కోసం ట్విటర్ వీడియో యాప్ అందుబాటులోకి రాబోతున్నది. ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, ట్విటర్ ప్రణాళికల్లో వీడియో యాప్ ప్రస్తావన కూడా ఉన్నదని దాని యజమాని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్‌లో పెరుగుతున్న వీడియో కంటెంట్‌పై దృష్టి పెట్టడానికి కంపెనీ కొత్త ప్రణాళికలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.

స్మార్ట్ టీవీల కోసం ట్విటర్ వీడియో యాప్ అవసరమంటూ ఎస్ -ఎం రాబిన్సన్ అనే ఓ ట్విటర్ యూజర్ చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. త్వరలో ట్విటర్ వీడియో యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. మీరు కోరుకుంటున్న యాప్ అతి త్వరలోనే రాబోతోంది అంటూ రాబిన్సన్‌కు ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు.

