ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ రోజుకో రూల్ తీసుకొస్తూ వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు బ్లూటిక్, సబ్‌స్క్రిప్షన్ అంటూ ఏవేవో నిబంధనలు పెట్టిన మస్క్, కొత్తగా ట్వీట్లు చదవడంపై పరిమితులు విధించారు. ట్విట్టర్ ఖాతాదారులు ఇకపై రోజుకు 6 వేల పోస్టులు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. ఇది వెరిఫై చేయబడిన ఖాతాదారులకే వర్తిస్తుంది. ఇక ధృవీకరించబడని ఖాతా నుంచి అయితే రోజుకు 600, కొత్త అకౌంట్లకు కేవలం 300 ట్వీట్లు చూసే విధంగా పరిమితి విధించారు. అంతకుమించి ట్వీట్లు చూడాలంటే నెలకు రూ.900 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. అయితే దీనితోకూడా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే రూ.9 వందలు చెల్లించినప్పటికీ రోజుకు 6 వేల ట్వీట్లకు మించి చూసే అవకాశం లేకపోవడం గమనార్హం.


