బిలియనీర్ ఎలన్ మస్క్ ఆపిల్ కంపెనీకి ఝలక్ ఇచ్చారు. ఐఫోన్ పోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఆపిల్ ఒకవేళ ఒపెన్‌ఎఐ కృత్రిమ మేధాను నిక్షిప్తం చేస్తే ఆ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా, స్పేస్‌ఎక్స్, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ను ఐఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌లలోకి చేర్చినట్లయితే ఆ పరికరాలను ఉపయోగించకుండా తన కంపెనీల సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఆపిల్ వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ తర్వాత ఎలన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐఫోన్లలో ఒపెన్ ఎఐని చేర్చడం భద్రత ఉల్లంఘనేనని, ఆమోదయోగ్యం కాదని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఒపెన్ ఎఐ వినియోగదారుల భద్రత, గోప్యతను ఎలా కాపాడగలదని ఎలన్ మస్క్ ప్రశ్నించారు. ఐఫోన్ తయారీదారు ఇటీవల ఆపిల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఎఐని అభివృద్ధి చేసింది. దీన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు కూడా ఆపిల్ కంపెనీ వెల్లడించింది.
