భారతదేశానికి అమెరికా నూతన రాయబారిగా ఎరిక్ గార్సెట్టి నియామకం ఖరారు అయింది. లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ అయిన గార్సెట్టి అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌కు అత్యంత సన్నిహితులు. ఆయన పేరును అమెరికా సెనెట్ 52 ఓట్లతో ఆమోదించింది. వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. దాంతో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఆ పదవి ఎట్టకేలకు భర్తీ అయింది. కాగా, గార్సెటీ నియామయంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దృఢపరిచేందుకు ఆయనతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. 2021లో భారతదేశంలో అమెరికా రాయబారిగా ఉన్న కెన్నెత్ జస్టర్ ట్రంప్ వైదొలిగిన తరువాత పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంటూ వచ్చింది.