Namaste NRI

ఎర్రర్‌ 500 టీజర్‌ ని లాంచ్‌ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

జస్వంత్‌ పడాల, నక్షత్ర త్రినయని జంటగా నటిస్తున్న చిత్రం ఎర్రర్‌ 500. ఎన్‌.సాందీప్‌ మైత్రేయ దర్శకుడు. యు. బాలరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  తెలుగు చిత్ర పరిశ్రమకి యువతరం రావాల్సిన అవసరం ఉంది. కొత్త తరాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.  ఎర్రర్‌ 500 టీజర్‌ బాగుంది. యూనిట్‌ ఎంతో ఫ్యాషన్‌తో చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి అన్నారు. అనంతరం  హీరో జస్వంత్‌ మాట్లాడుతూ అందరికీ కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. నన్ను హీరోగా పరిచయం చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు అన్నారు. వినూత్నమైన కథతో చక్కటి ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందించాం. ఈ చిత్రంలో జస్వంత్‌ను హీరోగా పరిచయడం చేయడం ఆనందంగా ఉంది అన్నారు చిత్ర దర్శకుడు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతం: ఫణి కల్యాణ్‌, ఛాయాగ్రహణం: గ్యారీ బిహెచ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events