
29వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఈ నెల 6 నుంచి 15 వరకు హైదరాబాద్‌లో నిర్వహించ బోతున్నారు. హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఈ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. బుధవారం ఏర్పాటు చేసిన సమావే శంలో హైదరాబాద్ ఫిలిం క్లబ్ అధ్యక్షుడు కేవీ రావు మాట్లాడుతూ మా క్లబ్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. మేము నిర్వహిస్తున్న ఏడవ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇది. ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో 24 చిత్రాలను ప్రదర్శిం చబోతున్నాం. అన్ని సినిమాలను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శిస్తాం. ఎలాంటి పాస్‌లు లేకుండా అందరిని ఆహ్వానిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.
