అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్‌పై దాడిని మరిచిపోకముందే, దక్షిణాఫ్రికాలో మరో వర్ణవివక్ష బయటపడింది. ఒక నల్లజాతి కుటుంబం క్రిస్మస్ సెలవుదినాలను సంతోషంగా జరుపుకునేందుకు దక్షిణాఫ్రికాలోని ఫ్రీ స్టేట్‌లోని మాసెల్స్‌పోర్ట్ రిసార్ట్‌కు వెళ్లింది. అక్కడ ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో నల్లజాతి కుటుంబానికి చెందిన చిన్నారులు ఈత కొట్టేందుకు దిగారు. ఇది గమనించిన శ్వేతజాతీయులు ఇద్దరు మైనర్లను జుట్టు పట్టుకుని స్విమ్మింగ్ పూల్ నుంచి బలవంతంగా బయటకు లాగి పడేశారు. గొంతు నులిమారు. చెప్పుతో కొట్టారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేంత లోపే దాడికి పాల్పడిన వారు పారిపోయారు.
