Namaste NRI

సమైక్య రాష్ట్రంలో కూడా.. ఒకేసారి ఇన్ని భర్తీ చేయలేదు

తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 91,142 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  సమైక్య రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇన్ని ఉద్యోగాల భర్తీ జరగలేదని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడ్డ రాష్ట్రం నేడు వాటన్నిటినీ సీఎం కేసీఆర్‌ సారధ్యంలో సాధించుకుంటున్నామన్నారు. తెలంగాణ అంటే బతకడం, బతికించుకోవడం, బాగుపడటం అని కేసీఆర్‌ ప్రపంచానికి చాటుతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, యాస, భాషకు నేడు ప్రపంచ ఖ్యాతిని కేసీఆర్‌ ప్రభుత్వం సాధించిందని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events