ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగుల తొలగింపు పనిలో పడ్డాయి. తాజాగా యాపిల్ సంస్థ కూడా అదేబాట పట్టింది. నియామకాలతో పాటు వ్యయాన్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా యాపిల్ తన సంస్థలోని చాలామంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో కొత్త నియామకాల బాధ్యతలను చూసే 100 మంది కాంట్రాక్టు ఆధారిత రిక్రూటర్లను విధుల నుంచి తప్పించింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్ గతనెలలో ఓ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల కోత తప్పదని సూచనాప్రాయంగా పేర్కొన్నారు..