కరోనా నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కేసీ తండాలో ఆమె రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో మాట్లాడారు. ‘‘మీ అందర్నీ కలవడం సంతోషంగా ఉంది. గిరిజనులంటే నాకు చాలా అభిమానం. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతోందని విన్నాను. అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. ధైర్యం చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనాను జయించగలం. అందరూ మాస్కు ధరించండి. శానిటైజర్ ఉపయోగించండి’’ అని గవర్నర్ తమిళిసై కోరారు.