దాయాది దేశం పాకిస్థాన్ విషయంలో భారత్ వైఖరిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ పాకిస్థాన్ అంశాన్ని ప్రస్తావించారు. ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. ఇకమీదట సానుకూలమైనా ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని స్పష్టంచేశారు. పాకిస్థాన్ మనతో ఎలా వ్యవహరిస్తే, మనమూ అందుకు తగిన విధంగా బదులిస్తామని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిం ది. మన దేశం పట్ల పాకిస్థాన్ ఎలా వ్యవహరిస్తే, మనం కూడా అందుకు తగిన విధంగా బదులిస్తాం. పాక్ నుంచి వచ్చే చర్య సానుకూలమైనా ప్రతికూలమైనా తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుంది అని జై శంకర్ స్పష్టం చేశారు.
ఉగ్రవాద కార్యకలాపాలపై కూడా జైశంకర్ స్పందించారు. పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవలే జమ్మూ లోయలో వరుసగా జరుగుతున్న ఉగ్ర దాడులతో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అస్థిరంగా మారాయన్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ఓ ముగిసిన కథ అని జైశంకర్ పేర్కొన్నారు.