Namaste NRI

మీ దేశాల నుంచి అమెరికన్లను బహిష్కరించండి.. గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

ఒక పక్క అగ్రరాజ్యం అమెరికాతో తీవ్రంగా యుద్ధాన్ని కొనసాగిస్తున్న ఇరాన్‌, మరో వైపు గల్ఫ్‌ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోని అమెరికన్లందరినీ తమ ప్రాంతాల నుంచి వెంటనే బహిష్కరించాలని, తమ దేశంలోని అమెరికా మిలిటరీ స్థావరాలను పూర్తిగా తొలగించాలని హెచ్చరించింది.ఈ మేరకు ఇరాన్‌ ఎంపీ మాట్లాడుతూ ఇరాన్‌ క్షిపణుల ముప్పు తప్పాలని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌ ఒమన్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, తుర్కియే, ఇతర దేశాల నేతలు భావిస్తుంటే, వారు వెంటనే తమ ప్రాంతాల్లోని అమెరికన్లను బహిష్కరించాలి, తమ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్‌లను తొలగించాలి అని పేర్కొన్నారు.

యుద్ధంలో 1,230 మంది ఇరానియన్లు మృతి చెందారని ఆ దేశ సంస్థ ఒకటి తెలిపింది. ఇరాన్‌, లెబనాన్‌లోని మిలిటెంట్‌ సంస్థ హెజ్బొల్లా నుంచి తమ దేశంపై పలుచోట్ల దాడులు జరిగాయని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. కాగా, 130 మంది సిబ్బందితో భారత నౌకాదళానికి అతిథిగా ఉన్న నౌక దేనాను అంతర్జాతీయ జలాల్లో హెచ్చరిక లేకుండా దాడిచేసి ముంచడం సముద్రంలో దారుణం గా ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌ అరాఘి ఖండించారు. గల్ఫ్‌లోని ఉత్తర ప్రాంతంలో ఒక యూఎస్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టామని, ఒక నౌకకు నిప్పు పెట్టామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events