Namaste NRI

ముగియనున్న హెచ్‌-1బీ వీసా.. రిజిస్ట్రేషన్ల గడువు

భారతీయులు సహా ఎంతోమంది వృత్తి నిపుణులు ఆశగా ఎదురుచూసే అమెరికా హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌ గడువు ఈ నెల 22తో ముగియనుంది. విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అనుమతించే ఈ వీసాకు విపరీతమైన పోటీ ఉంటుంది. అమెరికాలోని టెక్‌ కంపెనీలు ఎక్కువగా ఇండియా, చైనా వంటి దేశాలకు చెందిన వృత్తి నిపుణులపై ఆధారపడి ప్రతి సంవత్సరం వేలాదిమందిని నియమించు కుంటాయి. 2025 సంవత్సరానికి గాను హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌ గడువు మార్చి 22తో ముగుస్తుందని యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ తెలిపింది. ఫాం ఐ-129 (వలసేతర వర్కర్‌ వీసా పిటిషన్‌), ఫాం ఐ-907 (ప్రీమియం ప్రాసెసింగ్‌ సేవ కోసం)ను ఆన్‌లైన్‌లో ఉంచామని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress