అమెరికాలో డెల్టా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. దీంతో ఫేస్‌బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు అమెరికాలోని తమ ఉద్యోగులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని తప్పనిసరి చేశాయి. టీకా తీసుకున్నవాళ్లనే కార్యాలయాలకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. గూగుల్ కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యాభై శాతం ఉద్యోగులతో శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌లోని తమ సంస్థలను 16 నెలల తర్వాత తిరిగి ప్రారంభించింది. అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో ఎనభై శాతానికి పైగా డెల్టా వేరియంట్ కేసులే ఉండడం గమనార్హం.