విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ కథానాయిక. పరశురామ్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి కల్యాణి వచ్చా వచ్చా అనే రెండో గీతాన్ని విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ పాటను అనం త శ్రీరామ్ రచించగా, మంగ్లీ, కార్తీక్ ఆలపించారు. గోపీసుందర్ స్వరాలను అందించారు. కల్యాణి వచ్చా వచ్చా , పంచ కల్యాణి తెచ్చా తెచ్చా, సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా అంటూ పెళ్లి సందడికి అద్దం పడుతూ సాగిందీ గీతం. పెళ్లి నేపథ్యంలో ఈ పాట సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఏప్రిల్ 5న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల.b














