Skip to main content

Namaste NRI

ఫ్యామిలీ స్టార్ సెకండ్ సింగిల్ రిలీజ్..కల్యాణి వచ్చా వచ్చా

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్‌. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. పరశురామ్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి కల్యాణి వచ్చా వచ్చా  అనే రెండో గీతాన్ని విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ పాటను అనం త శ్రీరామ్‌ రచించగా, మంగ్లీ, కార్తీక్‌ ఆలపించారు. గోపీసుందర్‌ స్వరాలను అందించారు. కల్యాణి వచ్చా వచ్చా , పంచ కల్యాణి తెచ్చా తెచ్చా, సింగారీ చెయ్యందించా,  ఏనుగంబారీ సిద్ధంగుంచా అంటూ పెళ్లి సందడికి అద్దం పడుతూ సాగిందీ గీతం. పెళ్లి నేపథ్యంలో ఈ పాట సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఏప్రిల్‌ 5న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్‌, సంగీతం: గోపీసుందర్‌, ఆర్ట్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, రచన-దర్శకత్వం: పరశురామ్‌ పెట్ల.b

Social Share Spread Message

Latest News