Namaste NRI

థ్యాంక్యూ నుంచి  భావోద్వేగాలను కదిలించే ఫేర్‌ వెల్‌ సాంగ్‌

నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం థ్యాంక్యూ. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ రూపొందిస్తున్నారు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది. తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఫేర్‌ వెల్‌ అంటూ సాగ్‌ పాటను హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా  దిల్‌ రాజు మాట్లాడుతూ ఐదో తరగతి వరకు అమ్మానాన్నతో ఉంటాం. ఆ తర్వాత స్కూల్‌మేట్స్‌తో కలుస్తాం. ఆ తర్వాత అంతా కళాశాల జీవితమే. అంత అనుబంధమున్న కాలేజీ లైఫ్‌ను వదిలేసి వెళ్తుంటే ఎంత భావోద్వేగానికి గురవుతామో ఈ ఫేర్‌ వెల్‌ పాట ద్వారా చెప్పాం అన్నారు. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు విక్రమ్‌ కె. కుమార్‌. మూడేళ్లు థ్యాంక్యూ కోసం కష్టపడ్డాం. రిజల్ట్‌ కోసం వేచి చూస్తున్నాం అన్నారు నాగచైతన్య. తమన్‌ మాట్లాడుతూ  ఫేర్‌వెల్‌ సాంగ్‌ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు అన్నారు. ఈ సినిమాలో చైతూను చూస్తుంటే నాగార్జునను చూసినట్లు అనిపించింది అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events