కథానాయిక వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఫియర్. హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హరిత గోగినేని దర్శకత్వం. దత్తాత్రేయ మీడియా పతాకంపై ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. జయప్రకాష్, పవిత్రా లోకేష్, అనీష్ కురువిల్ల, షాయాజీ షిండే, సత్యకృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు నటిస్తున్నారు. అరవింద్‌కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కరుణాకరన్ క్లాప్‌నిచ్చారు. దర్శకురాలు హరిత గోగినేని చిత్ర విశేషాలు తెలియజేస్తూ సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశమిది. సీట్‌ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఉత్కంఠను పంచుతుంది. ఏడాది పాటు కష్టపడి ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశాను అని చెప్పింది. సినిమాలో తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని కథానాయిక వేదిక తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, ఆర్ట్: రాజీవ్ నాయర్, సంగీతం: అనూప్‌రూబెన్స్, సహనిర్మాత: సుజాత రెడ్డి, రచన-దర్శకత్వం: హరిత గోగినేని.
