
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజి దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి పురస్కారాన్ని ఆ దేశ ప్రభుత్వం రాష్ట్రపతికి ప్రదానం చేసింది. ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫిజి అధ్యక్షుడు రటు విలియమే మైవాలిలి కటోనివెరె చేతుల మీదుగా రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రెండు రోజుల ఫిజి పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము ఫిజి పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలను ప్రస్తుతించారు.
