Namaste NRI

ది ఘోస్ట్‌ చిత్రీకరణ పూర్తి

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ది ఘోస్ట్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ ఆశీస్సులతో సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేసింది చిత్ర యూనిట్‌. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ది ఘోస్ట్‌. ఇందులో పవర్‌పుల్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా విక్రమ్‌గా కనిపించబోతున్నారు నాగార్జున. ఈ పోస్టర్‌లో వారి లుక్‌ అల్ట్రా స్టైలిష్‌గా ఆకట్టుకుంది. అలాగే వారి దగ్గర వున్న మెషీన్‌ గన్‌లను చూస్తుంటే భారీ యాక్షన్‌కి రెడీ అవుతున్నట్లుగా అర్థమవుతోంది. యాక్షన్‌, థ్రిల్లర్‌ సినిమాలకు సంగీతం అందించడంలో స్పెషలిస్ట్‌ మార్క్‌ కె. రాబిన్‌ను ఈ సినిమాకు ఎంచుకున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా  అక్టోబర్‌ 5న విడుదల చేయనున్నాం అని చిత్ర బృందం పేర్కొంది. గుల్‌పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ముకేష్‌.జి, సంగీతం: మార్క్‌ కె.రాబిన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : వెంకటేశ్వరరావు చల్లగుళ్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events