Namaste NRI

ప్రపంచంలోనే ఫిన్లాండ్‌ మరోసారి అగ్రస్థానం

ప్రపంచంలోనే అత్యంతకర సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్‌ మరోసారి అగ్రస్థానంలో నిలించింది. అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని (మార్చి 20) పురస్కరించుకుని ఐరాస ప్రపంచ ఆనంద నివేదిక 2022ను విడుదల చేసింది. 146 దేశాలతో రూపొందించన జాతితాలో భారత్‌ 136వ స్థానంలో ఉంది. అయితే గతేడాది కంటే ఈసారి భారత్‌ మూడు స్థానాలు మెరుగుపర్చుకోవడం గమనార్హం. ఫిన్లాండ్‌ ప్రథమ స్థానంలో నిలవడం వరుసగా ఇది ఐదోసారి. తర్వాత డెన్మార్క్‌, ఐస్‌ల్యాండ్‌, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ టాప్‌ 5 స్థానాల్లో నిలిచారు. అమెరికా గతేడాదితో పోలిస్తే ఈ సారి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానం దక్కించుకుంది. 19వ స్థానంలో నిలిచిన చైనా ఈసారి ఏకంగా 72వ ర్యాంక్‌కు పడిపోయింది. ఈ జాబితాలో  ఉక్రెయిన్‌ 98వ స్థానంలో, రష్యా 80వ స్థానం దక్కించుంది. అఫ్గానిస్థాన్‌ అట్టడుగున ఉండగా లెబనాన్‌, జింబాబ్వే, రువాండాలో అల్ప సంతోషకర దేశాలుగా ఐరాస ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events