చాట్‌జీపీటీ యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. ముందుగా అమెరికాలో, ఆ తర్వాత మిగతా దేశాల్లోని ఐఫోన్ వినియోగదారులకు యాప్‌ను ప్రవేశపెడుతున్నట్టు చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ సంస్థ ప్రకటించింది. తర్వాత ఆండ్రాయిడ్ వినియోగదారులకూ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్ర్కైబర్లు ఇక నుంచి ఐఫోన్లలో యాప్‌ను వినియోగించవచ్చని తెలిపింది. ఇంతకాలం స్మార్ట్‌ఫోన్‌లలోని క్రోమ్, సఫారి వంటి బ్రౌజర్ల ద్వారా చాట్‌జీపీటీని వినియోగించుకునే అవకాశం ఉండేది.