లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాబితాను ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యం గా పని చేయనున్నట్లు వినోద్ తావ్‌డే పేర్కొన్నారు. 195 లోక్‌సభ స్థానాలకు తొలి జాబితా ప్రకటించిన బీజేపీ, ఇందులో తెలంగాణ నుంచి తొమ్మిది మందికి అవకాశం దక్కింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అవకాశం కల్పించింది. మల్కాజ్‌గిరి నుంచి ఈటెల రాజేందర్, హైదరాబాద్ మాధవీలత, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ భరత్ ప్రసాద్, జహీరాబాద్ బీబీ పాటిల్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అవకాశం కల్పించింది.