నాని హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి నాని ఫస్ట్‌లుక్‌తో పాటు స్పార్క్ ఆప్ దసరా పేరుతో చిన్న వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ప్రచార చిత్రంలో నాని ఊరమాస్ లుక్‌లో కనిపించారు. మండుతున్న ఓపెన్ క్యారీలో టిప్పర్లలో బొగ్గు లోడ్ చేస్తున్న సన్నివేశంతో ప్రచార చిత్రం ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఇందులో నాని గల్ల లుంగీ, ఎర్ర చొక్కా ధరించి మండుతున్న బొగ్గుతో బీడీ అంటించుకొని గంభీరంగా నడిచొస్తూ కనిపించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు ధరణి. గోదావరిఖనిలోని సింగరేణి కోల్మైన్స్కు దగ్గరగా ఉన్న ఓ గ్రామంలో జరిగే కథ ఇది. నాని మాస్` యాక్షన్ ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పక్కా తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌పై సుధాకర్ చేరకూరి నిర్మిస్తున్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సంతోష్ నారాయణన్, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్.














