అరవింద్‌కృష్ణ నటిస్తున్న సూపర్‌హీరో తరహా చిత్రం ఏ మాస్టర్‌పీస్. అఘరెడ్డి హీరోయిన్గా నటిస్తున్నారు. సుకు పూర్వాజ్ దర్శకుడు. శ్రీకాంత్ కండ్రాగుల నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇప్పటి వరకూ విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న అరవింద్ కష్ణ సూపర్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ పోస్టర్ లోనే అనేక విశేషాలు కనిపిస్తున్నాయి. టైటిల్ లోని ఏ అక్షరం నిప్పులు చిమ్ముతూ వలయాకారంలో ఉంది. ఆ వలయంలోని శక్తి హీరోకూ ఉందనే అర్థం వచ్చేలా అతని కుడిచేతికి సైతం అదే కనిపిస్తోంది. అతని వెనక శివలింగంతో పాటు, నెలవంక నుంచి పౌర్ణమి వరకూ చంద్రుడి పరిణామక్రమం కూడా ఉంది. పోస్టర్ లో ఎక్కువ ఆసక్తి కలిగిస్తోన్న అంశం కూడా ఇదే. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ టైటిల్‌కు తగ్గట్టుగానే ఇది మాస్టర్‌పీస్ లాంటి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో అరవింద్‌కృష్ణ పాత్ర స్టన్నింగ్‌గా వుంటుంది. ఇప్పటి వరకు హాలీవుడ్లో వచ్చిన సూపర్ హీరోస్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం ఉంటుంది. పెద్దలతో పాటు పిల్లలకు కూడా నచ్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివరామ్ చరణ్.


