అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో దేవకీ నందన వాసుదేవ అనే సినిమా చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. గతంలో కథానాయకుడి పాత్రను పరిచయం చేసిన టీజర్ సినిమా ప్రిమైజ్‌ని ప్రజెంట్ చేసింది. టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా, అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భం గా సర్‌ప్రైజ్ ట్రీట్‌తో ముందుకు వచ్చారు చిత్ర మేకర్స్. ఏమయ్యిందే అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
ఇటీవలి కాలంలో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఆకట్టుకునే బీట్‌లతో ఈ పాటని స్వరపరచినట్లుగా ఈ ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఈ పాట అశోక్ గల్లా తన లవర్ వారణాసి మానస పట్ల చూపుతున్న ఆరాధనను చూపుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ తమ రిలేషన్‌ని సీక్రెట్‌గా వుంచుతారు. ఈ పాటలో అశోక్ గల్లా ఆనందంగా కనిపించగా, వారణాసి మానస అందంగా ఉంది. వీరి జోడి తెరపై ఆకర్షణీయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్ కాగా, ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు.